Tue Feb 24 2026 11:08:30 GMT+0530 (India Standard Time)
KTR : నా పేరుతో ఎలాంటి సంస్థలు లేవు
తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు

తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కొంతమంది 'కేటీఆర్ సేవా సమితి' ‘కేటీఆర్ సేన’ పేరుతో కొన్ని కార్యకలాపాలు చేపడుతున్న విషయంపై కేటీఆర్ స్పందించారు. ఇలాంటి వాటి పేరుతో ఉన్న వాటికి ఎలాంటి నిధులు ఇవ్వవద్దని కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు తెలిపారు.
అనుమతి కూడా లేదు...
తన పేరుతో ఎలాంటి సంస్థలకి అనుమతి లేదని.. అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎవరైనా పనిచేయాలనుకుంటే ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. తన పేరుపై పెడుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన పై విధంగా స్పందించారు.
Next Story

