Fri Mar 20 2026 07:30:44 GMT+0530 (India Standard Time)
నేడు కృష్ణా బోర్డు సమావేశం
నేడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం జరగనుంది.

నేడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం జరగనుంది. కృష్ణా జిలాల విడుదల, జల విద్యుత్ ఉత్పత్తి, వరద జలాల అంశాలపై చర్చించేందుకు ఈరోజు అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొనాలని కోరారు. తాగు, సాగు నీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాల్సి ఉండటంతో దానికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చేందుకు త్రిసభ్య కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
నీటి విడుదలపై...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలపై ఈ చర్చించనున్నారు. వరద జలాల వినియోగంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీకి చెందిన నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Next Story

