Thu Dec 11 2025 16:06:21 GMT+0000 (Coordinated Universal Time)
కేఆర్ఎంబీ సమావేశానికి రాలేం.. ఏపీ అధికారుల సమాచారం
ఈ రోజు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్ మెంట్ సమాశం జలసౌధలో జరగనుంది

ఈ రోజు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్ మెంట్ సమాశం జలసౌధలో జరగనుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తాము ఈ సమావేశానికి హాజరుకాలేమని, వాయిదా వేయాలని కోరింది. అయితే దీనిపై కేఆర్ఎంబీ ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం జరగాల్సి ఉండటంతో ఏపీ అధికారుల కోరడం చర్చనీయాంశమైంది.
నీటి పంపకాలపై...
శ్రీశైలం, నాగార్జున సాగర్ లో ఉన్న నీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు నీటిని పంచుకోవాల్సి ఉంటుంది. రెండు ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిలో 27.03 టీఎంసీల నీనీటిని వాడుకోవాల్సి ఉండగా, ఆంధ్రప్రదేశ్ 131.75 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం అదనంగా వాడుకుంటుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎండాకాలంలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగు, సాగు నీరు అందదని వారు అంటున్నారు. మొత్తం మీద బోర్డు సమావేశంపై మరికొద్దిసేపట్లో క్లారిటీ రానుంది.
Next Story

