Tue Mar 17 2026 03:22:30 GMT+0530 (India Standard Time)
నేడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రమాణం
ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు

ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన చేత స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
రెండోసారి ఎమ్మెల్యేగా....
ఈ నేపథ్యంలో శాసనసభ్యుడిగా ఆయన చేత స్పీకర్ పోచారం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కూసుకుంట్ల రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఆయన మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించినా, 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. కూసుకుంట్ల ప్రమాణస్వీకారానికి పలువురు టీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు.
Next Story

