Sat Mar 07 2026 18:42:15 GMT+0530 (India Standard Time)
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని
తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. సీపీఐ 3వ రాష్ట్ర మహా సభల్లో ఈ ఎన్నిక జరిగింది.

తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. సీపీఐ 3వ రాష్ట్ర మహా సభల్లో ఈ ఎన్నిక జరిగింది. సీనియర్ నేతలు కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డిల మధ్య గట్టి పోటీ జరిగింది. ఇద్దరికీ జిల్లాల వారీగా సీపీఐ నేతలు విడిపోయారు. హైదరాబాద్, ఖమ్మం జిల్లా నేతలు కూనంనేని సాంబశివరావుకు మద్దతు తెలపగా, నల్లగొండ జిల్లా నేతలు పల్లా వెంకటరెడ్డికి సపోర్ట్ గా నిలిచారు. నిన్న అర్థరాత్రి వరకూ ఈ ఎన్నిక జరిగింది.
ఓటింగ్ నిర్వహించగా...
కూనంనేని సాంబశివరావుకు 59 ఓట్లు, పల్లా వెంకటరెడ్డికి 45 ఓట్లు వచ్చాయి. దీంతో కూనంనేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయినట్లు సీపీఐ తెలిపింది. కూనంనేని సాంబశివరావు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. నిన్నటి వరూ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కూడా కూనంనేని సాంబశివరావు పనిచేశారు.
Next Story

