Wed Mar 18 2026 21:37:47 GMT+0530 (India Standard Time)
ఇకపై రేవంత్ ముఖం చూడను
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై తాను రేవంత్ ముఖం చూడనని ఆయన అన్నారు

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై తాను రేవంత్ రెడ్డి ముఖం చూడనని ఆయన అన్నారు. చెరుకు సుధాకర్ ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. తనను అడగకుండా పార్టీలో చేర్చుకోవడం ఏంటని ఆయన నిలదీశారు. తనను ఓడించాలని ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ను ఎలా చేర్చుకుంటారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
పెద్ద తప్పు చేశారు...
రేవంత్ రెడ్డి ఈ విషయంలో పెద్ద తప్పు చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాను పార్లమెంటు సమావేశాల తర్వాతనే మునుగోడుకు వెళతానని ఆయన తెలిపారు. ఇష్టానుసారం పార్టీలోకి చేర్చుకోవడం పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను అధినాయకత్వం దృష్టికి తీసుకెళతానని కోమటిరెడ్డి తెలిపారు.
Next Story

