Fri Dec 12 2025 14:20:19 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్లో సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదని తెలిపారు. నిర్మాతలు, దర్శకులెవరూ టిక్కెట్ల రేట్లను పెంచాలంటూ తన దగ్గరకు రావొద్దంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తమది ఇందిరమ్మ ప్రభుత్వమని పేదల కోసమే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. తాను గతంలోనే అసెంబ్లీలో ఇకపై సినిమా టిక్కెట్ల ధరలను పెంచబోమని తెలిపినట్లు ఆయన గుర్తు చేశారు.
ఖర్చు తగ్గించుకోవాల్సిందే...
హీరోలకు వందలకోట్ల రెమ్యునరేషన్లు ఎవరు ఇమ్మన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. కుటుంబాలతో సినిమాకు వెళ్లాలంటే తక్కువ ధరలుండాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి టికెట్ రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నామని, ఈసారి పొరపాటు జరిగిందని అంగీకరించారు. నిర్మాతలు తమ బడ్జెట్ ను తగ్గించుకుని సినిమాలు తీయాలని కోరారు.
Next Story

