Sun Mar 15 2026 06:13:55 GMT+0530 (India Standard Time)
పార్టీ మార్పుపై కోమటిరెడ్డి ఏమన్నారంటే?
తెలంగాణ, మునుగోడు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు

తెలంగాణ ప్రజలు, మునుగోడు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ దసరాతోనే కేసీఆర్ రాక్షస పాలనకు చరమగీతం పలుకుదామని ఆయన తెలిపారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తన రాజకీయ నిర్ణయం ఉంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
భవిష్యత్ కార్యాచరణ...
తనపై ఎంత దుష్ప్రచారం చేసినా కేసీఆర్ పై పోరాటం తాను ఆపేది లేదని ఆయన అన్నారు. కేసీఆర్ దుర్మార్గ పాలన నుంచి విముక్తి కోసమే తన పోరాటామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. త్వరలోనే రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానన్న ఆయన అందరి ఆలోచనలకు అనుగుణంగానే తన నిర్ణయం ఉంటుందని తెలిపారు.
Next Story

