Mon Jun 05 2023 14:41:47 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 21న బీజేపీలో చేరుతున్నా
ఈ నెల 21వ తేదీన తాను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు

ఈ నెల 21వ తేదీన తాను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. 21న అమిత్ షా తెలంగాణకు రానున్నారని తెలిపారు. ఈరోజు కోమటిరెడ్డి ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షా తనను బీజేపీలోకి ఆహ్వానించారన్నారు. మునుగోడు అభివృద్ధి కోసమే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మరోసారి తెలిపారు. ఈ నెల 8వ తేదీన రాజీనామా లేఖను స్పీకర్ కు అందివ్వనున్నానని చెప్పారు.
ఒళ్లు దగ్గర పెట్టుకుని....
రేవంత్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తమది పరువు, ప్రతిష్ట కలిగిన కుటుంబం అని ఆయన అన్నారు. తమ కుటుంబాన్ని కించపర్చే విధంగా మాట్లాడిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా క్షమించరని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ను ఓడించడం కాంగ్రెస్ వల్ల కాదని, ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుందని కోమటిరెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో అది అసలు సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.
Next Story