Sun Mar 22 2026 14:45:16 GMT+0530 (India Standard Time)
ఎర్రబెల్లి ఖబడ్దార్,, రిటైర్ అయి వెళ్లిపో
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అమెరికాకు, కవిత జైలుకు పోతారని ఆయన అన్నారు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అమెరికాకు, కవిత జైలుకు పోతారని ఆయన అన్నారు. మునుగోడులో తనను ఓడించేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుట్రలు చేశారన్నారు. ఎర్రబెల్లి ఖబడ్దార్.. రాజకీయాల నుంచి రిటైర్ అయి వెళ్లిపో అంటూ ఆయన మండి పడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావుకు కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
గత పాలకులు....
మునుగోడులో జరిగిన కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అనేక ఆశలతో సాధించుకుంటే గత పాలకులు అన్ని దాన్ని నాశనం చేశారన్నారు. కేవలం ఒక కుటుంబమే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో బాగుపడిందని చెప్పారు. పదేళ్ల తర్వాత తెలంగాణ నిజమైన స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Next Story

