Thu Feb 05 2026 20:54:37 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ కండువా కప్పుకున్న కోమటిరెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇన్ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే సమక్షంలో పార్టీలో చేరారు

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే సమక్షంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.
మునుగోడు నుంచి ...
అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. చివరకు ఎన్నికలకు ముందు తిరిగి ఆయన కాంగ్రెస్ గూటికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మునుగోడు నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కోమటిరెడ్డి చేరిక సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు.
Next Story

