Fri Dec 05 2025 21:14:00 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కోమటిరెడ్డి నిర్ణయం
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. ఆయన ఈరోజు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశముంది

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. ఆయన ఈరోజు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశముంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంత కాలంగా పార్టీ పై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయన గాంధీ భవన్ వైపు కూడా చూడలేదు. పైగా ఆయన పార్టీపై విమర్శలు తరచూ చేస్తూ వస్తున్నారు.
బీజేపీలో చేరతారని...
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారన్న ప్రచారం గత కొంత కాలంగా జరుగుతుంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సీఎల్పీ సమావేశాలకు కూడా దూరంగానే ఉన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆయన విశ్వసించడం లేదు. బీజేపీలో చేరతారన్న ప్రచారం బలంగా జరుగుతుంది. ఆయన కొద్ది రోజుల క్రితం అమిత్ షాను కూడా ఢిల్లీలో కలసి వచ్చారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది. కార్యకర్తల అభిప్రాయం మేరకే తాను నడుచుకుంటానని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా వారికి చెప్పే చేస్తానని గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.
Next Story

