Sat Mar 07 2026 23:57:32 GMT+0530 (India Standard Time)
నేడు ఢిల్లీకి కోమటిరెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశం అవుతున్నారు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశం అవుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు. ఈ నెల 8వ తేదీన స్పీకర్ ను కలిసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. ఆరోజు స్పీకర్ కు తన రాజీనామా లేఖను సమర్పించే అవకాశముంది.
మరో ముఖ్య నేత కూడా...
అయితే ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనతో పాటు మరో ముఖ్య నేత కూడా బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలను కలిసే అవకాశముందని తెలుస్తోంది. ఒకవేళ అపాయింట్ మెంట్ దొరికితే ఈరోజే పార్టీలో చేరే అవకాశమున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
Next Story

