Mon Mar 16 2026 16:01:18 GMT+0530 (India Standard Time)
సీబీఐని అడ్డుకుంటే అవినీతి బయటపడదా?
చేసిన అవినీతి బయట పడకూడదనే సీబీఐని తెలంగాణలోకి రాకుండా అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

చేసిన అవినీతి బయట పడకూడదనే సీబీఐని తెలంగాణలోకి రాకుండా అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దర్యాప్తు సంస్థలను అడ్డుకుంటే ప్రజలు రేపు సరైన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. ప్రతి కార్యక్రమంలో టీఆర్ఎస్ అవినీతికి పాల్పడుతుందని, దానిని బయటపెట్టే దర్యాప్తు సంస్థలను అడ్డుకోవడానికి ప్రయత్నించడం సిగ్గు చేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో..
కేసీఆర్ అవినీతి బండారం బయటపడుతుందన్న భయంతోనే సీబీఐని అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. కానీ ప్రజల తీర్పు నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. ఎన్ని అబద్దాలు ఆడినా మునుగోడు ఉప ఎన్నికలలో విజయం తమదేనని కిషన్ రెడ్డి అన్నారు. కుట్రలు చేస్తూ గెలవాలనుకుంటే అది సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
- Tags
- kishan reddy
- cbi
Next Story

