Sat Dec 07 2024 01:53:01 GMT+0000 (Coordinated Universal Time)
కింగ్ కోటి ఆస్పత్రిలో వైద్యుడికి దేహశుద్ధి చేసిన భార్య.. ఎందుకంటే..
కింగ్ కోటి జిల్లా ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో పనిచేస్తున్న వైద్యుడికి భార్య, పిల్లలు ఉన్నారు. వీరు ఎల్బీనగర్లో..
కింగ్ కోటి ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న వ్యక్తికి అతని భార్య, ఆమె తరపు బంధువులంతా కలిసి బుధవారం (మే17) అర్థరాత్రి దేహశుద్ధి చేశారు. అందుకు కారణం.. అతను కొందరు యువతులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే. ఆస్పత్రి సిబ్బంది సమాచారమివ్వగా.. అతని భార్య, బంధువులను నారాయణగూడ పోలీసులు స్టేషన్ కు తరలించారు.
కింగ్ కోటి జిల్లా ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో పనిచేస్తున్న వైద్యుడికి భార్య, పిల్లలు ఉన్నారు. వీరు ఎల్బీనగర్లో నివాసం ఉంటున్నారు. డాక్టర్ గా ఉన్న అతను బుద్ధి చూపించాడు. బుధవారం రాత్రి నైట్ డ్యూటీకి హాజరైన అతను ఓ యువతిని కూడా వెంట తీసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న వైద్యుడి భార్య, ఆమె కుటుంబసభ్యులు ఆర్ధరాత్రి కింగ్ కోఠీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి గేటు వద్ద కాపుకాశారు. భార్య, బంధువులు ఆస్పత్రికి వచ్చిన విషయం తెలుసుకున్న వైద్యుడు.. గోడదూకి పారిపోయాడు.
వైద్యుడి వెంట వచ్చిన యువతి వారికి దొరకడంతో.. పరారైన వైద్యుడు తిరిగి ఆస్పత్రికి వచ్చాడు. అతడిని పట్టుకుని భార్య, ఆమె బంధువులు చితకబాదారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వగా.. వైద్యుడిని, అతడిపై దాడికి పాల్పడిన వారిని స్టేషన్ కు తరలించారు. ఇది కుటుంబానికి సంబంధించిన సమస్య అని, తామే పరిష్కరించుకుంటామని చెప్పడంతో పోలీసులు వారిని పంపేశారు.
Next Story