Sun Mar 15 2026 09:52:30 GMT+0530 (India Standard Time)
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి
ఖమ్మం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. బాణాసంచా పేలి పది మందికి గాయాలయ్యాయి

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. బాణాసంచా పేలి పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో వైరా నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనం బీఆర్ఎస్ నేతృత్వంలో జరుగుతుంది. ఈ సమ్మేళనం ప్రారంభానికి ముందు పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున బాణ సంచాను కాల్చారు.
పది మందికి గాయాలు...
బాణాసంచా ఒక గుడిసెపై పడి నిప్పంటుకుంది. దీంతో దాదాపు పది మంది ఈ ఘటనలో గాయపడ్డారు. గాయపడిన పది మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారని సమాచారం. పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.
Next Story

