Fri Dec 05 2025 11:57:30 GMT+0000 (Coordinated Universal Time)
Danam Nagender meets Revanth:రేవంత్ ను కలిసిన దానం.. అందుకేనట
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

Danam Nagender meets Revanth:బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అగ్రనేతలను కలవడం ఇటీవల సర్వ సాధారణమయింది. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన ఖైరతాబాద్ నుంచి వరసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆయన రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారన్న దానిపై ఇప్పటి వరకూ దానం నాగేందర్ స్పందించలేదు.
కాంగ్రెస్ లో చేరి...
ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తారన్న ప్రచారం మాత్రం హైదరాబాద్ నగరంలో జోరుగా సాగుతుంది. గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాకపోవడంతో నగర ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని చెబుతున్నారు. నగరానికి చెందిన వారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారన్న ప్రచారం కూడా సాగుతుంది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆయన కలిశారా? అన్నది తెలియాల్సి ఉంది.
Next Story

