Fri Dec 05 2025 08:15:12 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో దానం ఘాటు వ్యాఖ్యలు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఏయ్ నోర్ముయ్ అంటూ రాయలేని భాషలో ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
స్పీకర్ జోక్యంతో....
దీంతో స్పీకర్ గడ్డం ప్రసాదరావు జోక్యం చేసుకుని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరారు. దీంతో స్పీకర్ సూచనల మేరకు దానం నాగేందర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు కావాలని చేసినవి కావని, తాను సీనియర్ నని, తన గురించి అందరికీ తెలుసునని ఆయన అన్నారు.
Next Story

