Wed Jan 21 2026 11:05:01 GMT+0000 (Coordinated Universal Time)
హైడ్రా కూల్చివేతలపై దానం సంచలన కామెంట్స్
హైడ్రా నిరుపేదల ఇళ్లను అమానవీయంగా కూల్చివేస్తున్న సంఘటనపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ఆరోపణలు చేశారు.

హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లను అమానవీయంగా కూల్చివేస్తున్న సంఘటనపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ఆరోపణలు చేశారు. మూసీ పరీవాహకంలో కూల్చివేతలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ప్రత్యామ్నా మార్గాలు చూపకుండా పేదల ఇళ్లను కూల్చి వేయడం సరికాదని అన్నారు.
కూల్చివేతలు ఏంటి?
నగరంలో జలవిహార్, ఐమ్యాక్స్ లాంటివి ఎన్నో అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయని, అలాంటి వాటిని వదిలిపెట్టి సామాన్యుల ఇళ్లను కూల్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఇళ్లకు ఎరుపు రంగు మార్కు పెట్టడం తొందరపాటు చర్యగా అభివర్నించారు. కూల్చిన ఇళ్లకు స్టానికంగానే బాధితులకు వసతి కల్పిస్తే మంచిదని సూచించారు. పేదలు నివసించే స్లమ్ జోలికి వెళ్లొద్దని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. తాను ఈ విషయాన్ని పీసీసీ చీఫ్ తో చర్చించానని, ముఖ్యమంత్రితో కూడా మాట్లాడతానని తెలిపారు.
Next Story

