Sun Feb 01 2026 05:36:38 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీజేపీ కీలక సమావేశం
తెలంగాణ భారతీయ జనతా పార్టీ కీలక సమావేశం నేడు హైదరాబాద్ లో జరగనుంది

తెలంగాణ భారతీయ జనతా పార్టీ కీలక సమావేశం నేడు హైదరాబాద్ లో జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ బన్సల్ తో పాటు ముఖ్య నేతలందరూ హాజరుకానున్నారు. బండి సంజయ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా ఈ నెల 23వ తేదీన అమిత్ షా పర్యటనపై జరగనుందని తెలిసింది.
షా సభ ఏర్పాట్లు...
చేెవెళ్లలో బహిరంగ భ ఏర్పాట్లతో పాటు, చేరికల విషయంపై కూడా చర్చించనున్నారు. అమిత్ షా సమక్షంలో కీలక నేతలను చేర్పించాలని పార్టీ ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. ఇక సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. అమిత్ షాతో చర్చించాల్సిన అంశాలపై కూడా సమావేశంలో కొందరు ప్రస్తావించే అవకాశముంది.
Next Story

