Thu Mar 19 2026 06:41:54 GMT+0530 (India Standard Time)
నేడు కేసీఆర్ తో కేరళ సీఎం విజయన్ భేటీ
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కానున్నారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కానున్నారు. కేసీఆర్ అపాయింట్ మెంట్ ను పినరయి విజయన్ కోరారు. హైదరాబాద్ సీపీఎం జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి హాజరైన విజయన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవాలని భావించారు. అయితే కేసీఆర్ పినరయి విజయన్ ను మాత్రమే కాకుండా సెంట్రల్ కమిటీ సభ్యులందరినీ డిన్నర్ కు ఆహ్వానించారు.
సెంట్రల్ కమిటీ కూడా....
పినరయి విజయన్ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తారు. అయితే సెంట్రల్ కమిటీ సభ్యులు కేసీఆర్ ఏర్పాటు చేసిన డిన్నర్ కు వెళ్లాలా? లేదా? అన్న దానిపై నిర్ణయం తీసుకోలేదు. సీపీఎం జాతీయ కమిటీ సమావేశాలు మూడు రోజులు జరగనున్నాయి. రేపటితో సమావేశాలు ముగియనున్నాయి.
Next Story

