Fri Mar 20 2026 21:02:46 GMT+0530 (India Standard Time)
KCR : నేడు కేసీఆర్ రోడ్ షో మహబూబాబాద్ లో
కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన బస్సు యాత్రను చేపట్టారు.

కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన బస్సు యాత్రను చేపట్టారు. గత కొద్ది రోజులుగా వరసగా పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కనీసం ఎనిమిది స్థానాలను సాధించే లక్ష్యంతో ఆయన బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రాత్రి బస కూడా నియోజకవర్గాల్లోనే చేస్తూ జనంతో మమేకం అవుతూ ఆయన చేస్తున్న పర్యటనకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది.
మహబూబాబాద్ జిల్లాలో...
ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మహబూబాబాద్ లో జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొననున్నారు. ఇల్లెందు రోడ్డులోని ధరణి ఆసుపత్రి నుంచి ఇందిరాగాంధీ సెంటర్ వరకూ రోడ్ షో ను కేసీఆర్ నిర్వహించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు, అనంతరం రాత్రికి వరంగల్ కు చేరుకుని అక్కడే బసే చేయనున్నారు.
Next Story

