Mon Feb 02 2026 05:28:50 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ దూసుకుపోతుంది
సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్రాన్ని పునర్నించుకోవడంలో సఫలీకృతమయ్యామని సీఎం కేసీఆర్ అన్నారు.

సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్రాన్ని పునర్నించుకోవడంలో సఫలీకృతమయ్యామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అందరి కృషి వల్లనే ఇది సాధ్యమయిందన్నారు. కొందరు ఆటంకాలు సృష్టించినా ముందుకు వెళుతున్నామని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో కంటే అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో అద్భుతమైన సంపద సృష్టించబడుతుందని చెప్పారు. ప్రగతి భవన్ లో ఉగాది వేడుకల్లో ఆయన మాట్లాడారు.
భూముల విలువే నిదర్శనం....
తెలంగాణలో భూముల విలువ వేల నుంచి కోట్లకు చేరడమే ఇందుకు ఉదాహరణ అని కేసీఆర్ అన్నారు. దళితబంధు పథకం ద్వారా అట్డడుగు వర్గాల వారిని ఆదుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎన్నికల కోసం దళిత బంధు పథకాన్ని తేలేదన్నారు. దేశం యావత్తూ తెలంగాణ వైపు చూస్తుందన్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ దేశానికి మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు. దేశానికి అన్నం పెట్టేవిధంగా తెలంగాణ ముందుకు పోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
Next Story

