Tue Mar 24 2026 21:00:39 GMT+0530 (India Standard Time)
కవితను కూడా పార్టీ మారమన్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
తన కూతురు కవితను కూడా బీజేపీలోకి రావాలని వత్తిడి తెచ్చారని కేసీఆర్ అన్నారు. పార్టీ మారమని కోరారన్నారు

తన కూతురు కవితను కూడా బీజేపీలోకి రావాలని వత్తిడి తెచ్చారని కేసీఆర్ అన్నారు. పార్టీ మారమని కోరారన్నారు. ఇంతకంటే ఘోరం ఇంకేదైనా ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు పది నెలలు మాత్రమే సమయం ఉందని, బీజేపీతో ఖచ్చితంగా పోరాడతామని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాత వాళ్లకే మళ్లీ టిక్కెట్లు...
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తే పోరాడండి అని పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు. పాతవాళ్లకే మళ్లీ టిక్కెట్లు అని ఆయన ప్రకటించారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దాడులు చేస్తే వెంటనే అక్కడ నిరసన తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరూ ఎవరికీ భయపడాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశంలో స్పష్టత నిచ్చారు.
Next Story

