Sat Jan 31 2026 14:20:52 GMT+0000 (Coordinated Universal Time)
KCR : సిట్ అధికారులకు కేసీఆర్ ఆరు పేజీల లేఖ.. విచారణకు హాజరవుతానంటూ?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ అధికారులకు లేఖ రాశారు. నోటీసులపై స్పందించారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ అధికారులకు లేఖ రాశారు. నోటీసులపై స్పందించారు. తాను రేపు మధ్యాహ్నం మూడు గంటలకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉంటానని కేసీఆర్ తెలిపారు. మొత్తం ఆరు పేజీల లేఖను కేసీఆర్ సిట్ అధికారులకు రాశారు. తన ఇంటి గోడకు నోటీసులు అంటించడంపై కేసీఆర్ లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు సంబంధించిన పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. కేసుకు సంబంధించి స్టేట్ మెంట్ రికార్డుకు పరిధిలుఅవసరం లేదని ఆయన పేర్కొన్నారు. తాను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉంటానని చెప్పినా, తనను అక్కడే విచారించాలని కోరినప్పటికీ అందుకు సిట్ అంగీకరించకపోవడం శోచనీయమని తెలిపారు.
ఆరు పేజీల లేఖను...
చట్టంలో గోడకు నోటీసులు అంటించమని ఎక్కడా లేదని తెలిపారు. తాను ప్రస్తుతం జూబ్లీహిల్స్ పరిధిలో నివసించడం లేదని చెప్పినా సిట్ అధికారులు వినకపోవడం దురదృష్టకరమని అన్నారు. గత రెండేళ్ల నుంచి తాను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నానని, అయినా చట్టాన్ని గౌరవించి తాను రేపు నందినగర్ నివాసానికి వచ్చి విచారణకు హాజరవుతానని తెలిపారు. మీరు వచ్చి తన స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికల అఫడవిట్ లో చిరునామాకు, సిట్ నోటీసులకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. కాగా రేపు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు నిచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను విచారణ పేరిట వేధించడానికి, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీయడానికే ఈ నోటీసులంటూ వారు చెబుతున్నారు.
Next Story

