Thu Mar 19 2026 08:50:29 GMT+0530 (India Standard Time)
నేడు మేడ్చల్, జడ్చర్లకు కేసీఆర్
ఈరోజు తెలంగాణలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. మేడ్చల్, జడ్చర్లలో జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు

తెలంగాణ ఎన్నికల ప్రచారం ప్రారంభమయింది. అధికార, విపక్ష పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరస సభలు పెడుతూ జనంలోకి వెళుతున్నారు. నేటి నుంచి కాంగ్రెస్ కూడా బస్సు యాత్రతో ప్రజల ముందుకు వెళుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ రెండు రోజుల క్రితం తొలి జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ఎప్పుడో ప్రకటించగా, బీఆర్ఎస్ కూడా తన మ్యానిఫేస్టోను విడుదల చేసింది.
జనంలోకి...
ఈరోజు తెలంగాణలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. మేడ్చల్, జడ్చర్లలో జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభల పేరిట ఈ నెల 15వ తేదీ నుంచి ఆయన జిల్లాల పర్యటనకు వెళుతున్నారు. రోజుకు రెండు నియోజకవర్గాల్లో ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయి. మేనిఫేస్టో ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సభలను కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. నేడు సాయంత్రం జడ్చర్ల, మేడ్చల్ లో జరిగే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.
Next Story

