Sun Dec 14 2025 09:02:11 GMT+0000 (Coordinated Universal Time)
24న ఔరంగాబాద్‌కు కేసీఆర్
ఈ నెల 24వ తేదీన మరో భారీ బహిరంగ సభకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ సభను నిర్వహించాలని నిర్ణయించారు

మహారాష్ట్రపైనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టిపెట్టారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల కన్నా మహారాష్ట్రపైనే రాజకీయంగా ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ పథకాలను అక్కడి ప్రజలు స్వాగతించడం, అక్కడ ఎక్కువ మంది తెలంగాణ ప్రజలు ఉండటం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు. కనీసం కొన్ని స్థానాల్లోనైనా గెలిచేందుకు ఛాన్స్ ఉంటుందని నమ్ముతున్నారు. కర్ణాటక ఎన్నికలకు మాత్రం దూరంగా ఉన్నట్లే కనిపిస్తుంది. ఏపీలోనూ కేసీఆర్ అనుకున్నంతగా వర్క్ అవుట్ అయ్యేలా లేదు.
బహిరంగ సభకు
దీంతో మహారాష్ట్రలోనే ఆయన దృష్టి సారించాలనుకుంటుంది. ఈ నెల 24వ తేదీన మరో భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు. ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే రెండు సార్లు మహారాష్ట్రలో భారీ బహిరంగ సభను నిర్వహించిన కేసీఆర్ మరోమారు మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఆ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది బీఆర్ఎస్లో చేరుతుండటంతో అక్కడ ఆసక్తి కనపరుస్తున్నారు. ఔరంగాబాద్‌లోని అంకాస్ మైదానంలో జరిగే సభలో పలువురు బీఆర్ఎస్లో చేరతారని సమాచారం. బహిరంగ సభ ఏర్పాట్లను ఆర్మూర్, బోధన్ ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తున్నారు.
- Tags
- kcr
- aurangabad
Next Story

