Fri Dec 05 2025 17:39:59 GMT+0000 (Coordinated Universal Time)
Kcr : నేడు రెండు జిల్లాలకు కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఎన్నికల ప్రచారంలో మూడు సభల్లో పాల్గొంటున్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఎన్నికల ప్రచారంలో మూడు సభల్లో పాల్గొంటున్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. బతుకమ్మ, దసరా పండగల సమయంలో స్వల్ప విరామం ఇచ్చిన కేసీఆర్ నిన్నటి నుంచి రోజుకు మూడు సభల్లో పాల్గొనేలా పార్టీ నేతలు ప్లాన్ చేశారు. మూడు ప్రాంతాల్లో జరిగే సభల్లో ప్రసగించి కేసీఆర్ మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏ ఏ నష్టాలు జరుగుతాయో వివరిస్తూ వెళుతున్నారు.
బహిరంగ సభల్లో...
ఈరోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో జరిగే సభలో ఆయన తొలుత పాల్గొంటారు. అక్కడి నుంచి వరంగల్ జిల్లా మహబూబాబాద్ పట్టణంలో జరిగే సభలోనూ ప్రసంగించనున్నారు. చివరిగా అదే జిల్లాలో వర్ధన్నపేట సభలో పాల్గొంటారు. కేసీఆర్ సభలకు అన్ని ఏర్పాట్లు పార్టీ నేతలు చేస్తున్నారు. జనసమీకరణ బాగా చేసేలా నేతలు ప్రయత్నిస్తున్నారు. అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అలాగే మిగిలిన పార్టీల కంటే ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించి దూసుకెళుతుంది.
Next Story

