Sun Feb 16 2025 02:29:30 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ వి పచ్చి అబద్దాలు.. పీకే స్క్రిప్ట్ చదివారు
కేసీఆర్ మళ్లీ అబద్ధాలతో ప్రజల ముందుకు వస్తున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ మళ్లీ అబద్ధాలతో ప్రజల ముందుకు వస్తున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగాల ప్రకటన ఒక మోసపూరిత ప్రకటన అని అన్నారు. ప్రశాంత్ కిషోర్ అనే ఎన్నికల వ్యూహకర్త రాసిచ్చిన స్క్రిప్ట్ ను కేసీఆర్ అసెంబ్లీలో చదివారన్నారు. లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2014లో చెప్పిన కేసీఆర్ 2022 నాటికి వాటి సంఖ్య 80 వేలకు తగ్గిందని చెప్పారు. తన ఉద్యోగం ఏడాదిలో ఊడిపోతుందనే ఈ నియామకాల ప్రకటన కేసీఆర్ చేశారన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే....?
రాష్ట్రంలో 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ చెప్పిందని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఓడిపోతారని సర్వేలు తేల్చడంతోనే ఈ కొత్త ఎత్తులు వేస్తున్నారన్నారు. 80 వేల ఉద్యోగాలను కూడా కేసీఆర్ భర్తీ చేయబోరని రేవంత్ రెడ్డి అన్నారు.
- Tags
- revanth reddy
- kcr
Next Story