Fri Dec 05 2025 11:21:20 GMT+0000 (Coordinated Universal Time)
మోడీకి వెల్కమ్ కార్యక్రమానికి కేసీఆర్ మళ్లీ డుమ్మా
ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం చెప్పేందుకు ఈసారి కూడా కేసీఆర్ గైర్హాజరవతున్నారు

ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం చెప్పేందుకు ఈసారి కూడా కేసీఆర్ గైర్హాజరవతున్నారు. గత కొంతకాలంగా ప్రధానికి స్వాగతం చెప్పేందుకు ఆయన హాజరు కావడం లేదు. బీఆర్ఎస్ పార్టీని పెట్టిన తర్వాత కేసీఆర్ మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు స్వాగతం పలికేందుకు రావడం లేదు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య వివాదం ముదరడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు నోటీసులు జారీ కావడం వంటి అంశాలతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. దీంతోనే ఆయన మోదీకి స్వాగతం పలికేందుకు గత కొన్నాళ్లుా రావడం లేదు.
ఈసారి కూడా...
ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చినప్పుడు స్వాగతం పలికిన కేసీఆర్ మోదీ వచ్చినప్పుడు మాత్రం ముఖం చాటేస్తున్నారు. తనకు బదులుగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ను పంపుతున్నారు. ఈరోజు కూడా ప్రధానిమోదీకి తలసాని శ్రీనివాసయాదవ్ స్వాగతం పలికేందుకు వెళుతున్నారు. కేసీఆర్ వెళ్లడం లేదని అధికారికంగానే తెలిసింది. మహబూబ్నగర్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ తో పాటు మంత్రులు స్వాగతం పలకనున్నారు.
Next Story

