Mon Mar 23 2026 02:09:50 GMT+0530 (India Standard Time)
BRS : అందుకే పద్మారావు ఎంపిక.. కేసీఆర్ మామూలోడు కాదుగా
సిికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ఆయన ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆయనను ఎంపీగా పోటీ చేయించాలని కేసీఆర్ నిర్ణయించారు. తొలుత పద్మారావు ఈ ప్రతిపాదనకు అంగీకరించక పోయినా.. కేసీఆర్ వత్తిడి మేరకు ఆయన చివరకు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అంగీకరించారని ఆయన సన్నిహితులు తెలిపారు.
హ్యాట్రిక్ విజయాలతో...
పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి వరసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. తొలివిడత కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన చోటు దక్కించుకున్నారు. 2018 ఎన్నికలలోనూ ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి మరొకసారి గెలిచారు. రెండో దఫా డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. 2023లో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన మరొకసారి విజయం సాధించి హ్యాట్రిక్ విక్టరీ కొట్టారు. అందుకే అక్కడి నుంచి ఆయనను ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారు.
Next Story

