Fri Dec 05 2025 13:52:36 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్
తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించాలని నిర్ణయించింది.

తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ డెసిషన్ తీసుకున్నారు. తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు దసరా కానుకగా ఈ స్కీమ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
స్పీడ్ పెంచిన కేసీఆర్...
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఈరోజు తొమ్మిది మెడికల్ కళాశాలలను ప్రారంభించారు. రేపు పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి నీళ్లను విడుదల చేయనున్నారు. ఇప్పటికే వంద మందికి పైగా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇక విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఆకట్టుకోవడంతో పాటు, పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు కూడా బ్రేక్ఫాస్ట్ పథకం ఉపయోగ పడుతుందని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు.
Next Story

