Thu Dec 18 2025 17:57:58 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ కుటుంబంలో ఒక్కొక్కరికీ ఇన్ని ఆస్తులా?
కేసీఆర్ కుటుంబానికి ఇన్ని ఇళ్లేంది? ఇన్ని ఫాంహౌస్ లేందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు

కేసీఆర్ కుటుంబానికి ఇన్ని ఇళ్లేంది? ఇన్ని ఫాంహౌస్ లేందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం ఎంత దోచుకుందో తెలంగాణ ప్రజలకు తెలియాలని అన్నారు. ప్రజాధనాన్ని లూటీ చేసి ఇంటికొక్క ఫామ్ హౌస్ కట్టుకోవడమే కాకుండా పెద్దయెత్తున ఆస్తుల కూడబెట్టుకున్నారని తెలిపారు. ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ కు షబ్బీర్ ఆలీ సవాల్ విసిరారు.
అక్రమంగా సంపాదించిన...
అక్రమంగా సంపాదించిన సొత్తును కుటుంబ సభ్యులు ఎలా పంచుకున్నారో ఇప్పుడు అర్థమవుతుంది కదా? అని ప్రశ్నించారు. మత్తు పదార్థాలు వాడకపోతే కేటీఆర్ నార్కోటిక్ పరీక్షలు ఎందుకు చేయించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఫామ్ హౌస్ లలో మద్యం తాగుతూ నిబంధనలను అతిక్రమిస్తే పోలీసులు చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. ఎవరి మీద రాని ఆరోపణలు కేటీఆర్ పైనే ఎందుకు వస్తున్నాయని అన్నారు. అక్రమ ఆస్తులన్నీ బయటపెట్టాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
Next Story

