Thu Jan 08 2026 03:52:57 GMT+0000 (Coordinated Universal Time)
Telagnana కవిత రాజీనామా ఆమోదం.. మరో ఉప ఎన్నిక రెడీ
తెలంగాణలో మరో ఉప ఎన్నికకు సిద్ధమయింది.

తెలంగాణలో మరో ఉప ఎన్నికకు సిద్ధమయింది. నిజామాబాద్ స్థానికసంస్థల ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ ఆమోదించారు. కల్వకుంట్ల కవిత రాజీనామను ఆమోదించినట్లు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. దీంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమయింది. కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2021లో ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కవిత గెలుపొంది 2022లో ప్రమాణం స్వీకారం చేశారు.
మండలిలో భావోద్వేగ ప్రసంగం...
అయితే ఇటీవల కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురయిన సంగతి తెలిసిందే. పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం కారణంగా కల్వకుంట్ల కవిత పార్టీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. నాలుగు నెలలు అయినా తన రాజీనామాను ఆమోదించకపోవడంతో ఈ నెల 5వ తేదీన కవిత శాసనమండలిలో భావోద్వేగ ప్రసంగం చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి ఆలోచించుకోవాలని చెప్పినప్పటికీ ఇక తనకు బీఆర్ఎస్ కు సంబంధం లేదని, ఆ పార్టీ నేతగా తాను కొనసాగలేనని, తన రాజీనామాను ఆమోదించాలని సభలోనే కల్వకుంట్ల కవిత కోరారు.
అజారుద్దీన్ కు లైన్ క్లియర్...
దీంతో కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ ఆమోదించారు. తాను కొత్త పార్టీ పెట్టనున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ మేరకు శాసనమండలిలో ఖాళీ అయిన స్థానం గురించి ఎన్నికల కమిషన్ కు మండలి కార్యదర్శి లేఖ రాసిన తర్వాత ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఉప ఎన్నికలో ప్రస్తుత మంత్రి అజారుద్దీన్ ను కాంగ్రెస్ బరిలోకి దింపే అవకాశముంది. అజారుద్దీన్ ను ఏ సభలో సభ్యుడిని కాకుండానే మంత్రి వర్గంలోకి తీసుకోవడంతో అజారుద్దీన్ ను నిజామాబాద్ జిల్లా స్థానికసంస్థల ఎన్నికల నుంచి పోటీ చేయించే అవకాశముంది. ఈలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయితే కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ లభిస్తుందన్న ఆశాభావంతో పార్టీ నేతలున్నారు. మొత్తం మీద మరో ఉప ఎన్నిక త్వరలోనే తెలంగాణలో జరగనుంది.
Next Story

