Mon Nov 23 2026 19:49:33 GMT+0530 (India Standard Time)
Kavitha : తెలంగాణ నీటిని ఏపీ తరలించుకుపోతుంది : కవిత
Rajahmundry : రాజమండ్రిలో రేవంత్ రెడ్డిపై కవిత ఫైర్ అయ్యారు

Rajahmundry : రాజమండ్రిలో రేవంత్ రెడ్డిపై కవిత ఫైర్ అయ్యారు. విభజన చట్టం ప్రకారం నీటి వనరుల పంపిణీ చేసుకుందామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు కవిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. రాజమండ్రిలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ఇందుకు ఏపీ సీఎం చంద్రబాబు సహకరించాలని కోరారు. రాజమండ్రిలో స్నేహితురాలిని పరామర్శించిన కవిత, తన స్నేహితురాలి అత్తగారు మరణిస్తే ఈ శోక సమయంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రాజమండ్రికి వచ్చానని తెలిపారు. మనం రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసుండాలని కవిత కోరారు. కృష్ణా నీటి విషయంలో అనుమతులు లేకున్నా ఆంధ్రప్రదేశ్ నీళ్లను తరలించుకుపోతున్నదని కవిత ఆరోపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి చేతకాని తనమే...
ఈ విషయంలో ఆంధ్రా నాయకులను విమర్శించే కన్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అచేతన, నిస్సహాయ స్థితిని తెలంగాణ ప్రజలు తప్పుపడుతున్నారన్నారు. రాష్ట్రం విడిపోయేటప్పుడే మనం రూల్స్ ప్రకారం అపెక్స్ కౌన్సిల్ చెప్పే విధానం ప్రకారం నడుచుకోవాలని భావించామని కవిత తెలిపారు. ఆ విధంగా మంచి దారిలో నీటి పంపకాలు చేసుకుంటే ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు మంచిగా ఉంటాయని చంద్రబాబు నాయుడిని కోరుతున్నానని చెప్పారు. కానీ కేంద్రంలో బీజేపీతో పొత్తులో ఉన్నాం కనుక తెలంగాణ నీటి వనరులను కొల్లగొడుతామంటే మాత్రం మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంటుందని కవిత హెచ్చరించారు. కనుక సామరస్య పూర్వకంగా నీటి వనరుల పంపిణీ జరగాలని, దానికి చంద్రబాబు నాయుడు సహకరించా లని కోరుతున్నానని కవిత స్పష్టం చేశారు.
Next Story

