Fri Dec 05 2025 11:09:08 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : సంతోష్ రావు మోసం చేసిన మంత్రి ఆయనేనా?
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురయిన కల్వకుంట్ల కవిత వరసగా ట్వీట్లు చేస్తున్నారు

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురయిన కల్వకుంట్ల కవిత వరసగా ట్వీట్లు చేస్తున్నారు. పార్టీ నేతలను ప్రధానంగా హరీశ్ రావుతో పాటు సంతోష్ రావులపై మీడియా సమావేశంలో విమర్శలు చేసి పలు అవినీతి ఆరోపణలు చేసిన కల్వకుంట్ల కవిత ట్వీట్లతో వార్ మొదలు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ వందల కోట్ల రూపాయలు సంపాదించారని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తుండటంతో పార్టీకి కవిత తలనొప్పిగా తయారయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా కవిత చేసిన ట్వీట్ అంతే సంచలన మయింది.
పల్లె ప్రగతి కార్యక్రమంలో...
"కేసీఆర్ గారు మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని పల్లె ప్రగతి అనే ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రారంభించారు. సంతోషంగా హ్యాపీ రావు గ్రీన్ ఇండియా అనే కొత్త డ్రామా మొదలు పెట్టాడు. అతని కన్ను ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చే ట్రాక్టర్ల మీద పడింది. తన బినామీ అయిన వరికోలు వాసి, కోడిపందాలు చేసే హ్యాపీ రావు క్లాస్ దోస్తుతో 120+ కోట్ల కమిషన్ కోసం స్కెచ్ వేసాడు. అప్పటికే ఆ పిస్సార్ ట్రాక్టర్‌కి సంబంధించిన బిజినెస్ చేసి ఉండటం వల్ల బెంగళూరులో ట్రాక్టర్ కంపెనీలను పిలిపించుకుని, ఒక్కో ట్రాక్టర్‌కు లక్ష రూపాయిలు ఇవ్వాలనే ఒప్పందం కుదిరించుకున్నారు" అని ట్వీట్ లో పేర్కొన్నారు.
వాటా ఇవ్వకుండా...
"ఈ ఒప్పందంలో అప్పటి సంబంధిత శాఖ మంత్రిని దయ లేకుండా పక్కన పెట్టి, అతనికి వాటా ఇవ్వలేదు. ఆ మంత్రి కావాలని గట్టిగా అడగగా, అతనికి ఒక ఖరీదైన కారు ఇంటికి పంపించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ కారుకి ఈఎంఐ కూడా కట్టలేదు. హ్యాపీ రావు వల్ల ఇప్పటికీ ఆ సదరు మాజీ మంత్రి ఆ అవసరం లేని కారుకు తన సొంత పైసలతో ఈఎంఐ కట్టుకోవాల్సిన పరిస్థికి వచ్చాడు. ఆ 120+ కోట్లు ఇద్దరూ పంచుకుని, ఆ మంత్రికి మొండి చేయి చూపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ ఇద్దరు నాయకులకు కొన్ని రోజులు మాటలు లేకపోయాయి. ఈ మధ్యనే కుట్టుమిషన్లు పంచుతున్నారు" అంటూ ఎర్రబెల్లి దయాకర్ విషయాన్ని ప్రస్తావించారు.
Next Story

