Fri Dec 05 2025 10:26:10 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : కొత్త పార్టీపై కవిత ఏమన్నారంటే.. భవిష్యత్ నిర్ణయించేది వాళ్లే
తాను ఏ పార్టీలో చేరబోనని, చేరే ఆలోచన లేదని, భవిష్యత్ కార్యాచరణ మాత్రం నిర్ణయించేది మాత్రం మేధావులతో చర్చించిన తర్వాత మాత్రమేనని కల్వకుంట్ల కవిత అన్నారు.

కేసీఆర్ పై వత్తిడి తీసుకు వచ్చి తనపై సస్పెన్షన్ చేయించారని కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను తప్పుపట్టడం లేదని, తాను రాసిన లేఖ ఎవరు లేఖ రాశారని వంద రోజుల నుంచి అడుగుతున్నా పార్టీ నుంచి స్పందన లేదని, చాలా ఒత్తిడి తెచ్చి కేసీఆర్ ను తనపై సస్పెన్షన్ కు ఒప్పించారని కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ ఇద్దరు తనను సస్పెండ్ చేయడానికి కారకులని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తాను సస్పెన్షన్ పై బాధపడటం లేదని అన్నారు. తనను అడగకుండానే ఉరి తీశారని, కనీసం ఏమైందని కూడా అడగలేదని అన్నారు. తన మీడియా సమావేశం కొందరికి ఎంటర్ టైన్ మెంట్ అని, తాను మాత్రం బాధతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశానని కల్వకుంట్ల కవిత తెలిపారు.
అందరితో చర్చించి...
తనను సస్పెండ్ చేసిన తర్వాత తన దిష్టిబొమ్మలను దహనం చేసిన కార్యకర్తలు, ఆ ఉత్సాహం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఇచ్చినప్పుడు ఎందుకు చూపించలేదని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అవినీతి తిమింగాలలను పార్టీ నుంచి బయటపడేయాలన్నదే తన ప్రధాన డిమాండ్ అని కవిత అన్నారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని కల్వకుంట్ల కవిత తెలిపారు. తన భవిష్యత్ ప్రణాళికను తెలంగాణ జాగృతి కార్యకర్తలు, తెలంగాణ మేధావులతో చర్చించిన తర్వాతనే తీసుకుంటానని కల్వకుంట్ల కవిత తెలిపారు. తన జీవితంలో జరిగిన ముఖ్యమైన పరిణామమని, తన కోసం నిర్ణయాన్ని ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదని కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో తెలిపారు.
రాజకీయ భవిష్యత్ పై...
కాలం నిర్ణయిస్తుందని , తన రాజకీయ భవిష్యత్ అనేది ఏంటో తెలుస్తుందని కల్వకుంట్ల కవిత అన్నారు. తాను పార్టీ ప్రయోజనాల కోసమే పాటుపడ్డానని, పార్టీ బాగుండాలనే కోరుకుంటున్నానని కల్వకుంట్ల కవిత చెప్పారు. బతుకమ్మ పండగ నిర్వహించాలా? వద్దా? అన్నది రెండు రోజుల తర్వాత నిర్ణయించుకుంటానని చెప్పారు. తనకు తన సోదరుడు కేటీఆర్, తండ్రి కేసీఆర్ పై నమ్మకం ఉందని, వారిద్దరూ భవిష్యత్ లో పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకుంటారని కల్వకుంట్ల కవిత తెలిపారు. తాను ఏ పార్టీలో చేరబోనని, చేరే ఆలోచన లేదని, భవిష్యత్ కార్యాచరణ మాత్రం నిర్ణయించేది మాత్రం మేధావులతో చర్చించిన తర్వాత మాత్రమేనని అన్నారు.
Next Story

