Fri Dec 05 2025 13:14:56 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ జాగృతి రెండో విడత రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు
సామాజిక కోణంలో తెలంగాణ జాగృతి రెండో విడత రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు

సామాజిక కోణంలో తెలంగాణ జాగృతి రెండో విడత రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో వెల్లడించారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎస్టీ నేత ఎల్.రూప్ సింగ్ నాయక్, ఉపాధ్యక్షులుగా రియాజుద్దీన్, మంచాల వరలక్ష్మి, పుస్కూరి శ్రీకాంల్రావు, కొట్టాల యాదగిరి, కోల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా రంగు నవీన్ఆచారి, కార్యదర్శులుగా జాడి శ్రీనివాస్, గుంటి సుందర్, సేనాపతి అర్చన నియమితులయ్యారు.
ఏ ఎన్నికల్లోనైనా...
తెలంగాణ జాగృతి ద్వారా జనంలోకి వెళ్లేందుకు కల్వకుంట్ల కవిత అంతా సిద్ధం చేసుకుంటున్నారు. అందులోభాగంగానే కార్యవర్గాన్ని తిరిగి ఏర్పాటు చేసుకున్నారు. త్వరలో జరిగే స్థానికసంస్థల ఎన్నికలు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలతో పాటు ఏ ఎన్నిక వచ్చినప్పటికీ తెలంగాణ జాగృతి ద్వారానే అభ్యర్థులను బరిలోకి దింపాలని కవిత నిర్ణయించినట్లు తెలిసింది.
Next Story

