Fri Dec 05 2025 20:24:43 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : తెలంగాణలో కవిత యాత్ర.. ఎప్పటి నుంచి అంటే?
బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత తెలంగాణలో యాత్రను ప్రారంభించనున్నారు

బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత తెలంగాణలో యాత్రను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆమె ప్రకటించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కల్వకుంట్ల కవిత యాత్రను చేయాలని నిర్ణయించారు. దీనికి తెలంగాణ సామాజిక యాత్రగా నామకరణం చేశారు. తెలంగాణ జాగృతి సంస్థ పేరుతోనే ఈ యాత్రను కవిత చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అక్టోబరు చివరి వారంలో కవిత యాత్రను ప్రారంభించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలంగాణ జాగృతి సంస్థ ప్రతినిధులు తెలిపారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ...
కల్వకుంట్ల కవిత వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ యాత్రను చేయనున్నారు. ఈ యాత్రకు సంబంధించి రోడ్ మ్యాప్ ను రూపొందించే పనిలో ఉన్నారు. తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసే పనిలోనే ఈ యాత్రను చేయాలని కవిత భావిస్తున్నారు. కవిత ఎక్కడి నుంచి యాత్రను ప్రారంభిస్తారు.. ఎక్కడి ముగించాలన్న దానిపై త్వరలోనే ప్రకటించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా కవిత విడుదల చేయనున్నారు. దీన్ని బట్టి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి సంస్థను ముందు క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ యాత్రను చేపట్టినట్లు భావిస్తున్నారు.
Next Story

