Mon Mar 09 2026 19:24:29 GMT+0530 (India Standard Time)
Telangana : ఖమ్మంలో కవిత అరెస్ట్
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు

మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా వెలుగు మట్లలో బాధితులతో కలసి కవిత నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కవితతో పాటు ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో వీరి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఆందోళనకు దిగడతో...
అయితే కవిత, విశారదన్ అరెస్ట్ అక్రమమంటూ అక్కడ బాధితులతో పాటు అందరూ ఆందోళనకు దిగారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగేంత వరకూ తాను పోరాటం చేస్తానని కవిత ప్రకటించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి సరైన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారుు. ఖమ్మం జడ్పీ కూడలిలో కవిత ధర్నాకు దిగడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story

