Fri Dec 05 2025 11:41:41 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నా... ఉద్యమంలోకి వెళుతున్నా
బీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అలాగే పార్టీ పరంగా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనను పార్టీ నుంచి బయటకు పంపితే పరవాలేదని, తాను మళ్లీ ఉద్యమంలోకి వెళుతున్నానని అన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, తన కుటుంబ సభ్యులతో పాటు కేసీఆర్, కేటీఆర్ లు ముఖ్యమని అన్నారు. సంతోష్ రావు చేసిన పనికి కేటీఆర్ కు చెడ్డపేరు వచ్చిందని కల్వకుంట్ల కవిత అన్నారు. హరితహారం పేరుతో కేసీఆర్ పెద్ద కార్యక్రమం పెడితే, సంతోష్ రావు గ్రీన్ ఛాలెంజ్ పేరుతో అడవులను కొట్టేయాలని సంతోష్ రావు ప్లాన్ అని అన్నారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మోకిలాలో మెగా కంపెనీ కలిసి భారీగా విల్లా ప్రాజెక్టులను ఏర్పాటు చేశారన్నారు.
రెండు గ్యాంగ్ లు...
ఒకపక్క సంతోష్ రావు గ్యాంగ్ మరొకపక్క హరీశ్ రావు గ్యాంగ్ నిరంతరం బీఆర్ఎస్ ను ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తనకు ఇరవై ఏడేళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చానని, కేసీఆర్ కోసం, తెలంగాణ జాగృతి కోసం, తాను ఉద్యమంలో భాగస్వామ్యయ్యాయని కల్వకుంట్ల కవిత తెలిపారు. తాను ప్రజా ఉద్యమంలోకి వెళతానని కవిత చెప్పారు. కేసీఆర్ కు నష్టం చేసే పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత? అని తాను వ్యాఖ్యానిస్తే దానిని వక్రీకరించారని అన్నారు. కంప్యూటర్ లో హార్డ్ వేర్ బీఆర్ఎస్, సాఫ్ట్ వేర్ తెలంగాణ జాగృతి అని కల్వకుంట్ల కవిత అని అన్నారు.
పార్టీ ఎదుగుదలలో...
పార్టీ ఎదుగుదలలో తన భాగస్వామ్యం లేదా? అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. సంతోష్ రావు, హరీశ్ రావులు మేక వన్నె పులులని కవిత అన్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తనకు ఇబ్బందులు లేవని, వారిని పార్టీలో ఉంచొద్దని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ బాగుండాలని, పార్టీ కూడా బాగుండాలని తాను కోరుకుంటున్నానని కల్వకుంట్ల కవిత అన్నారు. తాత్కాలికంగా మాత్రమే వారిది నడుస్తుందని, తాను కర్మసిద్ధాంతాన్ని నమ్ముతానని, ఇంతకు ఇంత వారు అనుభవించి తీరతారని కల్వకుంట్ల కవిత అన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశాన్ని ముగించారు.
Next Story

