Thu Feb 05 2026 09:29:40 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : రేవంత్ రెడ్డి ఒక జాతిపై ఈ విషం గక్కుడేంది?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కొలేకనే ఒక జాతిని సీఎం టార్గెట్ చేశారన్నారు. అన్ని మర్యాదాలు అతిక్రమించి సీఎం మట్లాడటం సరైన పద్దతి కాదని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వటమంటే రాజ్యాంగాన్ని అవమానించటమేనని కల్వకుంట్ల కవిత తెలిపారు. సంజయ్ కి నీతి, నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
అన్ని మర్యాదలను అతిక్రమించి ...
రేవంత్ రెడ్డి అన్ని మర్యాదలను అతిక్రమించి మాట్లాడారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. వెలమజాతిని టార్గెట్ చేస్తూ నోటికి వచ్చినట్లు కామెంట్లు చేశారని, సీఎంగా ప్రమాణం చేసినప్పుడు ఏ బేధ భావం లేకుండా అందరినీ గౌరవిస్తానని ప్రమాణం చేశారని, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు మాటిచ్చారని, కానీ అవన్నీ మరిచి పోయి ఒక జాతిని టార్గెట్ చేయటం సరికాదన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే ఇలా ఒక జాతిపై విషం చిమ్ముతున్నారన్నారు. సీఎం తప్పకుండా ఇలాంటి వైఖరిని మార్చుకోవాల్సి ఉందని కవిత అన్నారు.
Next Story
