Fri Jan 02 2026 08:17:19 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రేవంత్ పై కవిత సంచలన కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను ఉరితీయాలని రేవంత్ అనడం సరికాదని అన్నారు. ఉద్యమకారుడిని ఉరి తీయాలని అంటే తన రక్తం మరుగుతుందని కవిత అన్నారు. శాసనమండలి వద్ద మీడియాతో చిట్ చాట్ చేసిన కవిత కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలు సరికాదన్నారు.
అసెంబ్లీకి కేసీఆర్ వస్తేనే...
కృష్ణా జలాలపై అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడి అందరి నోళ్లను మూయించాలని అన్నారు. బీఆర్ఎస్ మనుగడ, కొనసాగాలంటే ఆయన అసెంబ్లీకి రావాలని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ ను ఎవరూ కాపాడలేరని కవిత వ్యాఖ్యానించారు. తన రాజీనామా ఆమోదం కోసమే తాను శాసనమండలికి వచ్చానని కవిత అన్నారు. నదీజలాల అంశాలను పిల్లకాకుల మీద వదిలేయవద్దని సూచించారు.
Next Story

