Mon Mar 16 2026 07:04:44 GMT+0530 (India Standard Time)
నేడు సీబీఐ ఎదుటకు అవినాష్
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ అధికారుల ఎదుటకు విచారణకు హాజరు కానున్నారు

కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ అధికారుల ఎదుటకు విచారణకు హాజరు కానున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కావాలని ఆయనకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో నేడు మరోసారి అవినాష్ రెడ్డి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఉదయం పదకొండు గంటలకు ఆయన హాజరు కావాలని కోరారు.
అనేక సార్లు...
హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో సీీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని విచారించనున్నారు. దీంతో నేడు పులివెందుల, లింగాల మండలాల్లో పర్యటించాల్సి ఉన్నప్పటికీ సీబీఐ నోటీసుల నేపథ్యంలో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. ఇప్పటికే అనేకసార్లు ఆయన సీబీఐ ఎదుట విచారణకు హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మరోసారి విచారణకు పిలవడంతో వైసీపీ నేతల్లో టెన్షన్ పట్టుకుంది. ఆయన ముందస్తు బెయిల్పై విచారణను కూడా తెలంగాణ హైకోర్టు వాయిదా వేయడంతో సన్నిహితులు ఒకింత ఉత్కంఠగా ఉన్నారు
Next Story

