Sat Mar 07 2026 20:26:19 GMT+0530 (India Standard Time)
వైఎస్ అవినాష్ రెడ్డి గైర్హాజరు
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ ఎదుట విచారణకు గైర్హాజరయ్యారు.

కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ ఎదుట విచారణకు గైర్హాజరయ్యారు. 160 సెక్షన్ కింద ఆయన సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికి ఏడుసార్లు సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
కడపకు బయలుదేరి...
అయితే తనకు ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు నాలుగు రోజుల సమయం గడువు కావాలని అవినాష్ రెడ్డి కోరినట్లు తెలిసింది. అయితే దీనికి సీబీఐ నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందో తెలియదు కాని, ఆయన మాత్రం హైదరాబాద్ నుంచి నేరుగా కడపకు బయలుదేరి వెళ్లారు.
Next Story

