Mon Mar 16 2026 08:48:37 GMT+0530 (India Standard Time)
నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంది

కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంది. న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం నిన్న విచారించాల్సి ఉండగా విచారణను నేటికి వాయిదా వేశారు. ఈరోజు విచారణకు హాజరు కావాలని వాట్సప్ ద్వారా నోటీసులు అందచేశారు. దీంతో ఈరోజు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది.
అరెస్ట్ చేసే అవకాశం...
ఈరోజు హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై కూడా విచారణ జరగనుంది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత తన పిటీషన్ను కూడా విచారించాలని కోరడంతో ఆమె పిటీషన్ విచారణ అనంతరం దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయితే సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అవసరమైతే అరెస్ట్ చేసే అవకాశముందని న్యాయస్థానానికి తెలిపారు.
Next Story

