Thu Mar 19 2026 08:37:12 GMT+0530 (India Standard Time)
నేడు చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేడు ప్రమాణం స్వీకారం చేయనున్నారు.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేడు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఉదయం పదిగంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తి చేస్తారు. చీఫ్ జస్టిస్ గా ఉన్న సతీష్ చంద్ర శర్మ ఢిల్లీకి బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఉజ్జల్ భుయాన్ ను నియమించారు.
రాజ్ భవన్ కు కేసీఆర్....
రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని తెలుస్తోంది. ఆయనతో పాటు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్ కు వెళ్లి దాదాపు తొమ్మిది నెలలు కావస్తుంది. ఈరోజు రాజ్ భవన్ కు కేసీఆర్ చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారానికి హాజరవుతారని తెలిసింది.
Next Story

