Thu Jan 29 2026 10:45:59 GMT+0000 (Coordinated Universal Time)
రాజకీయాల్లో తగ్గుతున్న న్యాయవాదులు
రాజకీయాల్లోకి న్యాయవాదులు ఇటీవల కాలంలో రాలేకపోతున్నారని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

రాజకీయాల్లోకి న్యాయవాదులు ఇటీవల కాలంలో రాలేకపోతున్నారని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయవాదులు తమ కుటుంబ అవసరాల కోసం వృత్తికే పరిమితమవుతున్నారన్నారు. న్యాయవాదుల పట్ల గౌరవం పెరిగిందన్నారు. తాను దేశ వ్యాప్తంగా న్యాయవాదుల సమస్యలను తెలుసుకున్నానని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఇక న్యాయస్థానాలు కొన్ని పాతబడి పోయాయని, వాటిని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని ఎన్వీ రమణ తెలిపారు.
తెలంగాణ సర్కార్....
కేంద్ర ప్రభుత్వమే తన నిధులతో కోర్టులను నిర్మించాల్సి ఉందని, కానీ కేంద్రం ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వం నిర్మించడాన్ని జస్టిస్ ఎన్వీ రమణ అభినందించారు. కోవిడ్ తో న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. మొబైల్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించానని, త్వరలోనే ఆ నిర్ణయం తీసుకుంటుందని జస్టిస్ ఎన్వీ రమణ ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story

