Tue Mar 17 2026 20:24:43 GMT+0530 (India Standard Time)
షాను కలవడం ఆనందంగా ఉంది
అమిత్ షాను కలవడం ఆనందంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని ఆయన చెప్పారు

అమిత్ షాను కలవడం ఆనందంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని ఆయన చెప్పారు. తాను నటించే చిత్రాల వివరాల గురించి అమిత్ షాకు జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. నిన్న హోటల్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలసిన జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాలపైనే మాట్లాడారన్నారు. తాను సిినిమాలు తప్ప ఇతర అంశాలపై చర్చించలేదని ఆయనత చెబుతున్నారు.
తారకరత్నమే...
అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో ఎన్టీఆర్ పౌరాణిక సినిమాలను గురించి కూడా మాట్లాడినట్లు చెబుతున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ను కలవడం తనకు ఆనందంగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆయన ఈ మేరకు తెలుగులో ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అత్యంత ప్రతిభావంతమైన నటుడని, తెలుగు సినిమా తారకరత్నం అని అమిత్ షా కొనియాడారు.
Next Story

