Sun Mar 15 2026 13:25:15 GMT+0530 (India Standard Time)
Kalvakuntla Kavitha : నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ రిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో పూర్తి కానుంది

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో పూర్తి కానుంది. దీంతో కల్వకుంట్ల కవితను నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. కవితకు మధ్యంతర బెయిల్ నిన్న నిరాకరించడంతో జ్యడిషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వడంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
మార్చి 15న అరెస్టయి...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి 15వ తేదీన అరెస్టయిన కల్వకుంట్ల కవితను మార్చి 26వ తేదీ నుంచి తీహార్ జైలులో ఉన్నారు. ఆమెను పథ్నాలుగురోజుల పాటు రిమాండ్ కు న్యాయస్థానం అప్పగించింది. అదే సమయంలో ఆమె దరఖాస్తు చేసుకున్న మధ్యంతర బెయిల్ తిరస్కరణకు గురి కావడంతో తిరిగి తీహార్ జైలులోనే ఆమె కొన్నాళ్లు ఉండే అవకాశముంది.
Next Story

